జంగయ్య మరణం పార్టీకి తీరని లోటు

– సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
నవతెలంగాణ-మర్రిగూడ
తిరుగండ్లపల్లి గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్‌ నాయకులు మావిల్ల జంగయ్య మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. గురువారం మావిళ్ళ జంగయ్య దశదినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. జంగయ్య వారసత్వంగా కమ్యూనిస్టు పార్టీలో చేరి పార్టీకి బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన సేవలు గుర్తిస్తూ విప్లవ వందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్‌, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు చెల్లం పాండు రంగారావు,కార్యవర్గ సభ్యులు ఎరుకల నిరంజన్‌, గ్రామ శాఖ కార్యదర్శి, అల్వాల నర్సింహా, బాలకిషన్‌, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.