మండలంలోని దొంగతుర్తి గ్రామంలో మాల సంఘం గ్రామ అధ్యక్షునిగా జంజుపల్లి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మాల కుల సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ సమస్య ఎదురైనా అందరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా చేస్తానని వారికి హామీ ఇచ్చారు. సంఘ పాలకవర్గాన్ని ఈ క్రింది విధంగా ప్రకటించారు. అధ్యక్షులుగా జుంజిపల్లి రమేష్, ఉపాధ్యక్షులుగా లింగం రమణ, కార్యవర్గ సభ్యులుగా బొడ్డు చంద్రమౌళి, భూపెళ్లి సంజీవ్, లను కుల సభ్యులు అంత కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ సభ్యులు సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.