జాన్మియా మరణం పార్టీకి తీరని లోటు

– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- గరిడేపల్లి
గరిడేపల్లి మండలం కట్టవారి గూడెం గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు పటాన్‌ పెద్ద జాన్మియా (90) వడదెబ్బతో మరణించారని, ఆయన మరణం సీపీఐ(ఎం)కు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం జాన్మియా భౌతికకాయాన్ని జూలకంటి రంగారెడ్డి సందర్శించి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద పటాన్‌ జాన్మియా గరిడేపల్లి మండలంలోని కమ్యూనిస్టు పార్టీ మండలానికి పెద్ద సైనికు లాగా ఉండేవాడు ఇలాంటి మంచి వ్యక్తి ఆరోగ్యంతో మతి చెందిన చాలా బాధాకరమన్నారు. కట్టవారిగూడెం, మంగాపురం ,రానియిగూడెం గ్రామాల్లో మంచి కమ్యూనిస్టు పార్టీ సైనికులు లాగా ఉండేవాడు సీపీఐ(ఎం) పార్టీకి ధైర్యంగా ఉండే మంచి మనిషి రైతుల కోసం వ్యవసాయ కూలీల కోసం అనేక ఉద్యమాలు ఎక్కడికైనా తానున్నానని కమ్యూనిస్టు పార్టీ ధర్నాలవి లాంటివి గరిడేపల్లి వచ్చి ఉద్యమాలు చేసేవారని పేర్కొన్నారు. పార్టీ ప్రజా సంఘాలు ఇస్తరింపులో అగ్రభాగా న నిలిచారని పటాన్‌ పెద్ద జన్మియా లేని లోటు ి తీరనిదన్నారు ,వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాపం ప్రకటించిన వారిలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, హుజూర్‌నగర్‌ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్‌ , గరిడేపల్లి మండల కార్యదర్శి ఎస్‌ కే యాకూబ్‌, పటాన్‌ మై బలి గ్రామ సర్పంచ్‌ మీసాల అపర్ణ ,గూడెపు లక్ష్మయ్య, మీసాల మట్టయ్య ,టైలర్‌ వెంకన్న , తుమ్మ కొమ్మ యోనా, జక్కుల వెంకటేశ్వర్లు, నాయకులు పటాన్‌ మై బిల్లి పటాన్‌ రఫీ సాయి తదితరులు పాల్గొన్నారు.