హీరో కార్తీ ప్రస్తుతం ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ చిత్రం ‘జపాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. కార్తి తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. కార్తి డబ్బింగ్ చెబుతుంటారు. కానీ టేక్ ఎంతకీ ఓకే అవ్వదు. చివరికి టైటిల్ రోల్ జపాన్ గెటప్‌తో వచ్చి చెప్పడంతో ఓకే అవుతుంది. ఈ వీడియో యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కార్తి డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో సినిమాటోగ్రాఫర్ విజరు మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.