– పట్టించుకోని అధికారులు
– చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
నవతెలంగాణ – బొమ్మలరామారం
మండల కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డుపై పలుచోట్లు ఉన్న మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ మలుపుల వద్ద వాహనదారులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి.అయినా అధికారులు మూల మలుపుల వద్ద కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదు. ఈ నిర్లక్ష్యంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే దారులు మూలమలుపులతో ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. బొమ్మలరామారం మండల కేంద్రం నుండి నాగినేనిపల్లి వరుకు, మర్యాల నుండి చీకటిమామిడి వరకు,కాజీపేట నుండి రంగాపురం వరుకు ఈ మార్గం నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగుతూ ఉంటాయి.మూలములకు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూ ఉన్న మూలమలుపు కనీసం ప్రమాదం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మూలమూరుకు వద్ద కంపచెట్లు విపరీతంగా ఉండడంతో పలు గ్రామాల్లో రహదారులు మూసుకుపోతున్నాయి.
ఈ క్రమంలో ప్రయాణికులు ఎన్నో మూలమలుపులను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితోడు ఆ దారిగుండా పెద్ద వాహనాలు ఏవైనా ఎదురైతే రోడ్డు దిగే పరిస్థితి లేకపోవడంతో రాకపోకలు ఇబ్బందులు తప్పడం లేదు.మలుపుల వద్ద నెమ్మదిగా వెళ్తే పర్వాలేదు కానీ.. కాస్త వేగంగా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకోవడం కష్ట సాధ్యమే అని వాహనదారులు అంటున్నారు. మూలమలుపుల వద్ద వాహనాలు అకస్మాత్తుగా కనబడడంతో ద్విచక్రవాహనాలపై నుంచి కింద పడిన దాఖలలు కూడా లేకపోలేదు.మూల మలుపులు ప్రదేశాలలో ఆ శాఖ అధికారులు సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ఆ దారిగుండా ప్రయాణించేవారు అతివేగంగా ఇష్టరీతిన ప్రయాణిస్తున్నారు.ఆ ప్రదేశాలు పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉండడంతో ముందు నుంచి వచ్చే వాహనాలు కనబడకపోవడం, ఎదురుగా వాహనాలు ఢీకొట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వర్షాకాలం కావడంతో రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ఆ దారిగుండా వెళ్లడం వర్ణనాతీతం అని ప్రయాణికులు వాపుతున్నారు.ఇలాంటి సమస్యలు తలెత్తుకుంటే ఉండాలంటే మూలమలుపులు సూచికలతో పాటు పిచ్చి మొక్కలను తొలగించేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.