మల్లెపువ్వు తెలుపు వంశీచంద్‌రెడ్డి గెలుపు

– టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌
– వంశీచంద్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెల్పిన పార్టీ ప్రముఖులు
నవతెలంగాణ-ఆమనగల్‌
మల్లెపువ్వు తెలుపు లాంటి మనసున్న రాజకీయ దురంధరుడు డాక్టర్‌ చల్లా వంశీచంద్‌ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడక అని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా అధిష్టానం చల్లా వంశీచంద్‌ రెడ్డిని ప్రకటించిన సందర్భంగా షాద్‌నగర్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ ప్రముఖ నాయకులతో కలిసి ఆయన వంశీచంద్‌ రెడ్డితో పాటు షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తదితరులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి జిల్లాలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడానికి కాంగ్రెస్‌ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వంశీచంద్‌రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానానికి పేరుపేరునా ఆయన కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.