‘జాట్‌’.. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

'Jatt'... is a pure action entertainerబాలీవుడ్‌ హీరో సన్నీ డియోల్‌ యాక్షన్‌-ప్యాక్డ్‌ మూవీ ‘జాట్‌’ కోసం డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేనితో ఫస్ట్‌ టైం పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌తో హ్యూజ్‌ బజ్‌ను క్రియేట్‌ చేసింది.
తాజాగా మేకర్స్‌ రిలీజ్‌ చేసిన టీజర్‌ సినిమాపై ఎగ్జైట్‌మెంట్‌ని మరింతగా పెంచింది. రెండు పాత్రల మధ్య సాగే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమ వుతుంది. వారిలో ఒకరు పోలీసు ఆఫీసర్‌ చెప్పే డైలాగ్‌ హీరో నటోరియస్‌ నేచర్‌, శత్రువులను భయపెట్టే విధ్వంస మార్గాన్ని తెలియజేస్తోంది. విలన్స్‌ చేతులు, కాళ్లను గొలుసులతో కట్టి ఉంచిన సన్నీ డియోల్‌ క్యారెక్టర్‌ ఇంటెన్స్‌ ఇంట్రడక్షన్‌ని ప్రజెంట్‌ చేస్తోంది.
టీజర్‌లోని చాలా మూమెంట్స్‌ సన్నీ డియోల్‌ ఫిజిక్‌ ప్రజెన్స్‌, క్యారెక్టర్‌ గురించి తెలియజేస్తున్నాయి. మ్యాసీవ్‌ ఫ్యాన్‌ని ఉపయోగించి చేసిన ఫైట్‌ సీక్వెన్స్‌ అదిరిపోయింది. రణదీప్‌ హుడాను మెయిన్‌ విలన్‌గా పరిచయం చేయడంతో టీజర్‌ థ్రిల్లింగ్‌ నోట్‌తో ముగిసింది. రాపిడ్‌-ఫైర్‌ యాక్షన్‌, స్టన్నింగ్‌ విజువల్స్‌తో టీజర్‌ రోలర్‌-కోస్టర్‌ రైడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. ప్రతి సన్నివేశంతో ఆడియన్స్‌ని సీట్‌ ఎడ్జ్‌న ఉంచుతుంది. గ్లింప్స్‌ సూచించినట్లుగా సన్నీ డియోల్‌, రణదీప్‌ హుడా మధ్య ఇంటెన్స్‌ పేస్‌ ఆఫ్‌ మెయిన్‌ హైలెట్‌లలో ఒకటి. వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. వినీత్‌ కుమార్‌ సింగ్‌, సయామి ఖేర్‌, రెజీనా కసాండ్రా తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని, సంగీతం: థమన్‌ ఎస్‌, డీవోపీ: రిషి పంజాబీ, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా.