
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు లో వున్న జవహర్ నవోదయ విద్యాలయము సమితి 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2025-26 నల్గొండ జిల్లాలో పలు సెంటర్ల లో శనివారం ఏర్పాటు చేసిన పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు.ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 01.30 గం:ల వరకు జిల్లా లో 13 పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు.పరీక్ష నిర్వహణకు గాను 13 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, జవహర్ నవోదయ కి సంబందించిన సెంటర్ లెవెల్ అబ్జర్వెర్స్, 6 రూట్ ఆఫీసర్స్ లను నియమించామని అన్నారు.ఇట్టి పరీక్షకు మొత్తము 2329 మంది అభ్యర్ధులుకు గాను 1803 అభ్యర్ధులు హాజరు కాగా, 526 మంది అభ్యర్ధులు గైర్హాజరు అయినారని, నల్గొండ జిల్లాలో 2329 మందికి 1803 పరీక్షలకు హాజరు కాగా 526 మంది ఆబ్సెంట్ అయ్యారని అన్నారు.సూర్యాపేట జిల్లాలో 1525 మందికి 1199 మంది, యదాద్రి భువనగిరి జిల్లా లో 693 మందికి 485మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 4547 మంది విద్యార్థులకు 3485 మంది పరీక్షలు రాశారని తెలిపారు.