
మండల నూతన ఎంపీడీవో గార్లపాటి జవహర్ రెడ్డి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎంపీడీవోగా విధులు నిర్వహిచిన ప్రవీణ్ కుమార్ హాసన్పర్తి మండల ఎంపీడీవోగా బదిలీ కావడంతో మండల ఎంపీడీవో గా ధర్మసాగర్ మండలం నుండి ఎంపీడీవోగా విధులు నిర్వర్తించిన జవహర్ రెడ్డి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారం సూచనలు సలహాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుదాం అని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతానని అన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు ఒకరికొకరు సమన్వయంతో పరస్పర సహకారంతో అభివృద్ధి లక్ష్యంగా సాగుదాం అని అన్నారు.