జవవర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతికి ధరఖాస్తులకు ఆహ్వానము

Jawawar Navodaya Vidyalaya invites applications for Class VIనవతెలంగాణ – పెద్దవూర
దేశవ్యాప్తంగా వున్న 649 నవోదయ విద్యాలయాలలో అరవ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింది. నవోదయ విద్యాలయాలు సీబీఎస్ఈ లో ఉత్తమ ఫలితాలు సాధించి మిగతా అన్ని విద్యాలయాల కంటే ప్రథమస్థానంలో వున్నాయి.మనందరికి తెలిసిందే, అన్ని సౌకర్యాలతో జిల్లాలోని ప్రతిభా వంతులైన విద్యార్థినీ విద్యార్థులకు నూతన విద్యా విధానం ప్రకారం, కంప్యూటర్ ద్వారా బోధనతో పాటు, ఆట, పాట, ఆర్ట్,ఎన్ సీసీ స్వఔట్ అండ్ గైడ్ లతో విద్యార్థులకు సర్వంగిక వికాసం పొందే అవకాశం వుంటుంది, ఉచిత విద్య విద్యార్థినీ విద్యార్థులకు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో కొనసాగుతుంది విద్యా, బుద్ధి, క్రమశిక్షణలు అలవరచి, ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడమే యీ విద్యాలయాల ప్రధాన ఉద్దేశ్యం, ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, సాఫ్ట్ వేరే ఇంజనీర్స్, సాఫ్ట్ వేరే ఇంజనీర్స్,SOFT శాస్త్రవేత్తలు, గ్రూప్ -1,2,3,4 అధికారులు ఉన్నత పదవులలో కొనసాగుతున్నారు.
ఈ ప్రవేశపరీక్ష రాయడానికి అర్హతలు..
ఏ జిల్లాకు చెందిన వారు ఆ జిల్లాలోనే వుంటూ, ఆ జిల్లాలోనే చదువుతూ ఆ జిల్లాలోనే అప్లై చేయాలి. అభ్యర్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు విద్యార్థి ఏ జిల్లాలో ఉన్నటువంటి నవోదయ విద్యాలయాలలో అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేయబోతున్నారో అదే జిల్లాలో నివాసం ఉండి ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో తల్లిదండ్రుల యొక్క నివాస ధ్రువీకరణ సర్టిఫికేట్ క్షుణ్ణంగా పరిశీలించబడుతుంది. 2,3,4,5 తరగతులు ఆ జిల్లాలోని గవర్నమెంట్, రికగ్నైజ్డ్, ఎయిడేడ్ స్కూళ్ళ లో చదివి వుండాలి.పుట్టిన తేది: 01/05/ 2013 నుండి 31/07/2015 మధ్య జన్మించి ఉండాలి.కనీసం75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించ బడతాయి. ప్రతి విద్యార్థి ఒకసారి మాత్రమే అప్లై చేయడానికి అర్హుడు,ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు గవర్నమెంట్ నియమాల ప్రకారం రిజర్వేషన్ వుంటుంది. కనీసం 40 శాతం అంగవైకల్యం ఉన్నవారు మాత్రమే వికలాంగుల కోటా నందు అప్లై చేసుకోవడానికి అర్హులు.1/3 సీట్లు అమ్మాయిలకు కేటాయించబడతాయి.ఆరవ తరగతిలో ప్రవేశానికి మొత్తం సీట్లు 80
ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి
ప్రవేశ పరీక్షకు అప్లై చేయడానికి ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ నంబర్ ఓటీపీ గవర్నమెంట్ చేత ధృవీకరించబడిన బర్త్ సర్టిఫికెట్ తప్పక అవసరం, ఆధార్ కార్డ్ లేనివారు వెంటనే ఆధార్ కు అప్లై చేయాలి. ఆధార్ వచ్చేంత వరకు తెలంగాణ ప్రభుత్వం చేత ధృవీకరించబడిన నివాస ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థి తన ఫోటోతో పాటు తన తల్లిదండ్రుల లేదా సంరక్షకుల సంతకం ఉన్న సర్టిఫికెట్ ఆన్లైన్ లోదరఖాస్తు ఫారం లో నింపాలి మరియు వివరాలను ధృవీకరిస్తూ అభ్యర్థి ఐదవ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులచే జారీ చేయబడిన ధ్రువీకరణ పత్రాన్ని  అప్లోడ్ చేయాలి.ప్రవేశ పరీక్షకు అప్లై   సెప్టెంబర్ 16 చేసుకోవచ్చు.
అర్బన్ ప్రాంత వివరాలు
ఉమ్మడి నల్గొండ జిల్లా లో 3,4,5 తరగతులలో ఏ ఒక్క రోజైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేత జారీ చేయబడిన భువనగిరి, మోత్కూర్, చౌటుప్పల్, ఆలేరు, పోచంపల్లి, యాదగిరి గుట్ట, సూర్యాపేట, హుజూర్ నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి, దేవరకొండ, నల్గొండ, మిర్యాలగూడ, నక్రేకల్ నందికొండ, చిట్యాల, హాలియ, చండూరు ప్రాంతాలు అర్బన్ ప్రాంతాలుగా గుర్తించారు. ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో అప్లై చేయడానికి నల్గొండ జిల్లాకు చెందిన వారు ఈ  వెబ్సైట్ అడ్రస్ www.navodaya.gov.in లో అప్లై చేయాలి. పరీక్షా కేంద్రానికి తప్పకుండా ఆధార్ కార్డ్ మరియు హాల్ టికెట్ తో వెళ్ళాలి, ప్రవేశ పరీక్షను మీరు అప్లికేషను ఫారంలో తెలిపిన మీడియంలో మాత్రమే రాయాల్సి ఉంటుంది. తర్వాత మార్చబడదు. స్టడీ సర్టిఫికేట్ ఫారమును అప్లై చేయడానికి ముందు వెబ్సైటు (www.navodaya.gov.in) నుండి డౌన్లోడ్ చేసుకుని 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానాచార్యుల చేత సంతకం చేయించి, స్టాంప్ వేసుకొని వచ్చిన తర్వాతనే అప్లై చేయాలి, అప్లికేషన్ ఫాం పై విద్యార్థి సంతకం, తండ్రి సంతకం తప్పకుండా వుండాలి. ఫోటో కూడా అప్ లోడ్ చేయ్యాలి. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ప్రవేశ పరీక్షకు ఒకసారి మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. అన్ని వివరాలు నింపిన తర్వాత సబ్మిట్ చేయడానికి ముందు ఒకసారి నిర్ధారణ చేసుకుని ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. పరీక్ష కేంద్రాన్ని మీ ఇష్టానుసారం మార్చడానికి ఉండదు. అప్లై చేసే టప్పుడు పనిచేసే మీ సొంత మొబైల్ సంబర్ మాత్రమే ఇవ్వాలని ప్రిన్సిపాల్  నాగభూషణం తెలిపారు.