జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక

జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక
ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి 80వ జన్మదిన సందర్భంగా అంపశయ్య నవీన్‌కి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా కవి ఎలనాగ కి జయమిత్ర సాహిత్య సాంస్కతిక వేదిక అభినందన, సత్కారం ఈ నెల 7న రవీంద్రభారతిలో మధ్యాహ్నం 2 గంటలకు వుంటుంది. డా|| అమ్మంగి వేణుగోపాల్‌, శ్రీమతి వాణీదేవి సురభి, డి.కె. సమరసింహారెడ్డి, పి.వి. ప్రభాకరరావు, ఆచార్య వెలుదండ నిత్యానందరావు తదితరులు పాల్గొంటారు.
మేడే రచనలకు ఆహ్వానం
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకుని దేశాన్ని ఆవరించిన సామాజిక సంక్షోభం, దోపిడీ, వివక్షతలను ప్రతిఫలించే కథలు, కవితలు, పాటలు, వ్యాసాలను రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఆహ్వానిస్తున్నారు. ప్రతి విభాగంలోను మేలైన రచనలకు ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులతో పాటు రెండు ప్రోత్సాహక బహుమతులు (రూ. 5000, 3000, 2000 మరియు 1000) అందజేస్తారు. కవితలు, పాటలు ఎ4 సైజులో రెండు పేజీలకు, కథ, వ్యాసం ఎ4 సైజులో 8-10 పేజీలకు మించకుండా ఏప్రిల్‌ 20 లోపు sramikasambaralu 24@gmail.com మెయిల్‌కు పంపాలి. మేలైన రచనలు పుస్తకం రూపంలో ప్రచురించబడతాయి. జాషువా సాంస్కృతిక వేదిక, విజయవాడ.
స్ఫూర్తి కందివనం కు కందికొండ పురస్కారం-2023
నెలపొడుపు సాహిత్య సాంస్కతిక వేదిక నిర్వహించిన కందికొండ రామస్వామి స్మారక పురస్కారం 2023కి స్ఫూర్తి కందివనం రచించిన డిమ్కి కథల సంపుటి ఎంపికయింది. ఏప్రిల్‌ 21 న నాగర్‌కర్నూల్‌ సభలో పురస్కారం-2023 ప్రదానం, పదివేల నగదు, శాలువా మెమెంటోతో సత్కరిస్తారు. – వనపట్ల సుబ్బయ్య, 9492765358.
డా|| వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ
పాలపిట్ట – వాసా ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సమగ్రత, మతసామరస్యం, సమాజంలో ఉన్నతమైన విలువలను పాదుకొల్పడం లక్ష్యంతో సుప్రసిద్ధ సాహితీవేత్త డా. వాసా ప్రభావతి సంస్మరణార్థం కవితల పోటీ నిర్వహిస్తున్నాయి. అన్ని ప్రాంతాల కవులు తమ రచనల్ని ఏప్రిల్‌ 30 లోపు ఎడిటర్‌, పాలపిట్ట, ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌-6, ఎం.ఐ.జి-2, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044, ఈమెయిల్‌: palapittamag@gmail.com. . పంపాలి. బహుమతులు వరుసగా 3000/-, 2000/-, 1000/-, ఎనిమిది కవితలకు ప్రత్యేక బహుమతులు (ఒక్కొక్క కవితకు రూ. 500). వివరాలకు : గుడిపాటి, 9490099327.
అక్కినేని జీవితం, నట జీవితంపై వ్యాసరచన, మినీకవితల పోటీ
సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు సౌజన్యంతో యువకళావాహిని-సాహితీకిరణం సంయుక్త ఆధ్వర్యంలో అక్కినేని శతజయంతి సందర్భంగా వ్యాసరచన, మినీకవితల పోటీ నిర్వహిస్తోంది. అంశాలు:1) అక్కినేని పౌరాణిక, భక్తి చిత్రాలు 2) అక్కినేని జానపద, చారిత్రాత్మక చిత్రాలు, 3) అక్కినేని సాంఘిక చిత్రాలు 4) అక్కినేని జీవిత వ్యక్తిత్వం. ప్రతి అంశానికి రెండు బహుమతులు: ప్రథమ 2500/-, ద్వితీయ 1500/-. అక్కినేని నటనపై 12లైన్లు మించకుండా మినీకవితలు పోటీలో 4 మినీకవితలకు ఒక్కొక్క కవితలకు రూ||1000/-. 2024లో అక్కినేని శతజయంతి వేడుకలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేయబడును. వ్యాసాలు/మినీకవితలు పోస్టు/కొరియర్‌ ద్వారా మాత్రమే ఏప్రిల్‌ 30 లోపు సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌నెం.3, హైదరాబాద్‌-500102 చిరునామాకు పంపాలి. వివరాలకు :పొత్తూరి సుబ్బారావు, 9490751681.

శివేగారి దేవమ్మ కథా పురస్కారాలు – 2023
శివేగారి దేవమ్మ కథా పురస్కారాలు- 2023 సం.కోసం 2022-23 లో ప్రచురితమైన కథాసంపుటాలు, బాలల కథాసంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన ఉత్తమ కథా సంపుటానికి 7000/- , బాలల కథా సంపుటానికి 3000/- , పురస్కార వుంటుంది. సంపుటాలు మూడేసి ప్రతులు ఏప్రిల్‌ 20 లోపు K.V Meghanath Reddy, H.No. 11/21/01.  – 517583N.G.O s colony, Puttur – 517583,Tirupathi (D), AP. చిరునామాకు అందేలా పంపాలి. వివరాలకు :కె.వి.మేఘనాథ్‌ రెడ్డి. 6300318230