నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
డివైఎఫ్ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల మల్లేష్ కోరారు. బుధవారం ఆయన మండలంలోని హన్మాపురం గ్రామంలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి, మాట్లాడారు. నవంబర్ 10,11 తేదీలలో వలిగొండ మండల కేంద్రంలో జిల్లా మహాసభలు జరగనున్నాయని, జిల్లా వ్యాప్తంగా ఈ మహాసభలకు 300 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా పేరుతో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి రూ.4016 ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో బీజేపీ విఫలం చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తూ భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు, ఈ జిల్లా మహాసభలకు మండలం నుంచి యువకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని, సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మోటే శివశంకర్, దయ్యాల ప్రమోద్, ఉపేందర్, శ్రీశైలం, రాజు, రాము లు పాల్గొన్నారు.