ఈనెల 24న కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల స్థాయి సదస్సు ను జయప్రదం చేయాలని కోరుతు మంగళవారం తెలంగాణ యూనివర్సిటీలో మాదిగ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఎస్ ఎఫ్ జాతీయ కార్యదర్శి మురళి కృష్ణ, జిల్లా ఇన్చార్జి శ్యాం మాదిగ మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై తీర్పు వెలువరించిన అనంతరం నిండు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా మాదిగ విద్యార్థి, నిరుద్యోగులకు సి ఎం రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని మండిపడ్డారు.ఎంఅర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసానికి నిరసనగా చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణలో భాగంగా కాకతీయ యూనివర్సిటీ లో మాదిగ విద్యార్థులతో రాష్ట్ర యూనివర్సిటీల సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే మొదటగా వర్గీకరణ అమలు చేస్తామని, ఇచ్చిన అన్ని నోటిఫికేషన్ల లో ప్రత్యేక అర్థినెన్స్ తెచ్చి మరి అమలు చేస్తామని ఉపాధ్యాయ నియామకాల్లో మాదిగ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందాని ఇలాంటి పరిస్థితులో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై మదిగలందరు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎంఎస్ ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు దినేష్ మాదిగ, ఉపాధ్యక్షులు వెంకట రమణ మాదిగ, నరేష్ ,శేఖర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.