20న కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి ..

Jayapradham the dharna in front of the collector's office on 20th.– అండర్ పాస్ నిర్మాణ సాధన కమిటీ కన్వీనర్: సిల్వెర్ ఎల్లయ్య..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తక్షణమే అండర్ పాస్ నిర్మాణ చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని ధర్నా కరపత్రంను భువనగిరి మండలం రామచంద్రపురం గ్రామంలో అండర్ పాస్ సాధన కమిటీ కన్వీనర్ సిల్వర్ ఎల్లయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర జాతీయ రహదారి దాటడానికి తక్షణమే అండర్ పాస్ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని  డిమాండ్ చేశారు. అండర్ పాస్ నిర్మాణం కోసం ఈ నెల 20న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు సిద్ధారెడ్డి, కంచి మల్లయ్య, సిల్వర్ మధు, కళ్లెం సుదర్శన్ రెడ్డి, కే వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, బి రాములు, బిక్షపతి, చంద్రమౌళి, పుష్ప ,రాములు, పాండు, అశోకు ,శ్రీనివాసు, శేఖర్ రెడ్డి, పారిజాత లు పాల్గొన్నారు.