
నవతెలంగాణ – చివ్వేంల
ఫిబ్రవరి 16న బిజేపి కార్మిక, కర్శక వ్యతిరేక నిర్ణయాల కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగు కార్మిక పారిశ్రామిక, గ్రామీణ ప్రాంతాల బంద్ ను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.మంగళవారం మండల కేంద్రంలోని సివిల్ సప్లై హమాలీ కార్మికులతో కలిసి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బిజేపి దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా దెబ్బ తీసిందన్నారు.. నూటికి 65శాతం వ్యవసాయం పై ఆధారపడి జీవించే రైతులు, వ్యవ సాయ కూలీలు, హమాలీ రంగం, వ్యవసాయ మార్కెట్ లో వివిధ రకాల ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయే పరిస్థితులను కేంద్రం తీసుకు వచ్చి వ్యవసాయ చట్టాలు తెచ్చి కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధానాలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు… కార్మికులు సంపద సృష్టి కర్తలు అన్న సంగతి మరచి పెట్టుబదారులే సంపద కు మూల కారణం అని చెప్పడం సిగ్గు చేటు అన్నారు..
కార్మికుల కు కనీస వేతనం ఇవ్వాలని, లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ప్రయత్నం ఆపాలని, దేశాన్ని, దేశ రాజ్యాంగ హక్కులను కాపాడాలని కోరుతూ కార్మిక రైతు వ్యవసాయ సంఘాలూ పెద్ద ఎత్తున పిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా పారిశ్రామిక గ్రామీణ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, బంద్ కు అన్నీ రాజకీయా, కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు..ఈ కార్యక్రమంలో హమాలీ సంఘము అధ్యక్షుడు యేసు, అమ్మయ్య, నవీన్, వెంకన్న, శ్రీను, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.