నేడు యాదగిరి గుట్ట లో జరిగే ఎంఆర్పీఎస్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయలని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం పత్రిక ప్రకటన ప్రకటన ద్వారా తెలిపారు. మాదిగలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై మరో పోరాటానికై యాదాద్రి భువన గిరి జిల్లాలోని యాదగిరిగుట్ట వద్ద లక్కీ ఫంక్షన్ హాల్ లో 19వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంట లకు నిర్వహించే రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకుల సదస్సును జయప్రదం చేయాలన్నారు. రాష్ట్ర అధ్య క్షులు మేడి పాపయ్య, గుర్రాల శ్రీనివాస్ మాదిగల నాయకత్వంలో రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ సిద్ది పేట జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయ కులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర సదస్సుకు తరలిరావలన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి, ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ కోరారు. మాదిగల ఓట్లపై దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ప్రేమ మాదిగల న్యాయమైన ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. మాదిగ ల చిరకాల కోరికైనా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం జరిగే రాష్ట్ర మహా సదస్సును మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.