24న ఐటీడీఏ కార్యాలయం ముందు జరిగే నిరసన ప్రదర్శనను జయప్రదం చేయండి 

– టీ.పీ.టీ.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం ముందు సోమవారం జరిగే నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని స్థానిక టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు శనివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏ పరిధిలో గల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ, విద్యారంగ, ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమములు ఉధృతం చేయడం జరుగుతుందన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో సవరించిన సర్వీస్ రూల్స్ వెంటనే ప్రకటించాలని చెప్పారు. కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు పోస్టులను మంజూరు చేయాలని కోరారు. పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను పాఠశాల సహాయకులుగా ఉన్నతీకరించాలని సూచించారు.
ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలి తెలిపారు. జీవో 317 అప్పీల్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం జరిగే నిరసన ప్రదర్శనకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో కదిలి రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి చాట్ల శ్రీనువాసరావు, సభ్యులు బి.బావుసింగ్, లక్ష్మి బాయమ్మ, హైమావతి, పూర్ణ, నాగమణి, భానుచందర్, జోగయ్య, రాంబాబు, కవీందర్, వసంతరావు, వెంకన్న, రవీందర్, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.