– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
కేంద్రంలోని బీజేపీి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి కుదింపులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో ఆ పార్టీ మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శి వర్గ సభ్యురాలు కొండమడుగు నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఉన్నదన్నారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. దేశంలో మత విభజన తెస్తూ ప్రజల మధ్యన ఘర్షణ సష్టిస్తూ భారత రాజ్యాంగ విలువలను, భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయాలని చూస్తున్నారని ఈ విధానాలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందించాలని కోరుతూ గ్రామ గ్రామాన ప్రజలను పోరాటాల వైపు నడిపించడానికి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి7 తేదీ వరకు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేష్ ,అన్నంపట్ల కష్ణ, మండల కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య, ఎల్లంల వెంకటేష్, పాండాల మైసయ్య, రాసాల వెంకటేష్, జిట్టా అంజిరెడ్డి, కొండాపురం యాదగిరి లు పాల్గొన్నారు.