నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రామకృష్ణాపురం, పెంచికల్పహాడ్ టు వేములకొండ వరకు నేషనల్ హైవేపై అండర్ పాస్ నిర్మాణం చేపట్టి ప్రమాదాల నుండి ప్రజలను కాపాడాలని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని వీరవెల్లి గ్రామంలోని ప్రజలతో ఈనెల 20జరిగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని గ్రామ ప్రజలతో సంతకాల సేకరణ, అండర్పాస్ నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగిందని, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర రామకృష్ణాపురం పెంచికల్పాడు టు వేములకొండ వరకు నేషనల్ హైవేపై అండర్పాస్ నిర్మాణం లేకపోవడంతో అనేకమంది ప్రజలు ఇబ్బందికి గురవి ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రమాదాలను అరికట్టి, అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా ఈనెల 20న వందలాది మంది ప్రజలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామని ఈ ధర్నాకు మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా నేషనల్ హైవే దాటి వివిధ గ్రామాలకు వెళ్లడానికి బోనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర అండర్పాస్ నిర్మాణం చేపట్టాలి , 2010 నుండి 2024 వరకు రోడ్డు దాటుతూ ప్రమాదం గురైన,మరణించిన ప్రతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ప్రమాదంలో గాయపడిన వికలాంగులైన వారికి నష్టపరిహారం ,నెలవారి పింఛన్ చెల్లించాలని ,ప్రతిరోజు హైవే నుండి నాలుగు మండలాలు 40 గ్రామాలకు పైగా భువనగిరి వివిధ ప్రాంతాలకు ఈ రోడ్డు ద్వారా ప్రయాణాలు చేస్తున్న ఆటో బైకు కారు ఇతర వాహనాలు ప్రయాణికుల రోడ్డు దాటడానికి వెంటనే నిర్మాణం చేపట్టి ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య అండర్ పాస్ నిర్మాణ కమిటీ కన్వీనర్ సిలివేరు ఎల్లయ్య కోకన్వీనర్ మందాడి సిద్ధారెడ్డి, కంచి మల్లయ్య, బోనగిరి రాములు, బిక్షపతి,పాండు, శేఖర్ రెడ్డి, పారిజాత, ఆకిటి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కంచి లలిత, చంద్రమౌళి, పుష్ప, కొండే కృష్ణ, రేగు రవి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.