
– కార్మిక సంఘాల నాయకుల పిలుపు
నవతెలంగాణ – కంటేశ్వర్
జనవరి 26న జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ ఆటో బైక్ ర్యాలీలను జయప్రదం చేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం మత రాజకీయాలను తిప్పి కొట్టండి అని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వై ఓమయ్య ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి సుధాకర్ ఐఎఫ్టియు జిల్లా నాయకులు శివ కుమార్ లు మాట్లాడుతూ..కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కార్పొరేట్ , మతోన్మాద , నయా ఉదారవాద విధానాల వలన ప్రజల నుండి వచ్చే కార్మిక వర్గం రైతాంగం పేద ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతను గుర్తించి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ మత రాజకీయాలకు తెరలేపుతూ అయోధ్య రామ మందిరాన్ని ముందుకు తీసుకువచ్చిందన్నారు ఇంకా పూర్తిగా నిర్మాణం కానీ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట చేయడం సరికాదని పెద్ద పెద్ద పీఠాధిపతులు సూచించినా కూడా పట్టించుకోకుండా పార్లమెంటు ఎన్నికల ముందే కార్యక్రమాన్ని తీసుకుందని అక్షింతల పేరుతో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులు , సమస్యలను పక్కదారి పట్టించే విధంగా ప్రజల్ని మతం మత్తులో ముంచుతుందన్నారు.ఈ బీజేపీ చేస్తున్న మత రాజకీయాలను తిప్పి కొట్టడంలో భాగంగా దేశంలోని కార్మిక వర్గం , రైతాంగం , ప్రజలందరినీ చైతన్యం చేయడం కోసం దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు , ( రైతు సంఘాల ఐక్యవేదిక ) సంయుక్త కిసాన్ మోర్చా , అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం , అఖిల భారత కిసాన్ సభలు సంయుక్తంగా ఫిబ్రవరి 16 న దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ , పారిశ్రామిక బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు.ఫిబ్రవరి 16 న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో జరిగే పారిశ్రామిక , గ్రామీణ బంద్ విజయవంతనికి సిఐటి యు, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు ఐఎఫ్టియు, ఐ ఎన్ టి యు సి ఇతర కార్మిక సంఘాలతో రైతు, వ్య వసాయ సంఘాలు పిబ్రవరి 16న జరిగే పారిశ్రామిక,గ్రామీణ, భందును జయప్రదం చేయాలని బిజెపి ప్రభుత్వ మత రాజకీయాలను తిప్పి కొట్టాలని జిల్లాలో సమ్మెను విజయవంతం కోసం అన్నీ కార్మికులు సంఘాలు కలిసి కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలలో కార్మిక సంఘాలతో పాటు రైతు, వ్యవసాయ సంఘాలూ కలసి ఐటిఐ గ్రౌండ్ నుండి ధర్నా చౌక్ వరకు ట్రాక్టర్, ఆటో, బైక్ ర్యాలీలు పెద్ద ఎత్తున కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.