
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద వృద్ధురాలికి అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఛైర్మన్ అయిలి మారుతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారం పేట గ్రామానికి చెందిన ఆత్కూరి రామక్క గత రెండు సంవత్సరాల నుండి క్యాన్సర్ గడ్డల వ్యాధితో బాధపడుతుంది. నిరుపేద పరిస్థితులవల్ల హాస్పటల్ కు వెళ్లలేక మంచానికే పరిమితమైంది. కనీసం ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఆ వృద్ధురాలిది. ఆమె భర్త కూడా 10 సంవత్సరాల క్రితంమే చనిపోవడంతో రామక్క పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఛైర్మన్ అయిలి మారుతి వారి ఇంటికి వెళ్లి ఆ వృద్ధురాలికి నేనున్నాననే మనోధైర్యం చెప్పి, పండ్లు , రూ.3000 వేల రూపాయల ఆర్థిక సాయం చేసి నిత్యవసర సరుకులు కూడా పంపిస్తానని, అలాగే హాస్పటల్ కు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తానని భరోసా కల్పించిన ఛైర్మన్ ఆయిలి మారుతి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీలాంటి పేదవారి కోసమే మా ఫౌండేషన్ నిరంతరం పనిచేస్తుందని ఆయన తెలియజేశారు.