ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు 

Jayashankar Jayanthi Celebrationsనవతెలంగాణ – పెద్దవంగర
తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. స్వరాష్ట్ర ఏర్పాటులో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పూర్ణచందర్, మురళి, శ్రీనివాస్, వెంకన్న, రవీందర్ రెడ్డి, లింగమూర్తి, లక్ష్మణ్, సోమన్న, అంజయ్య, వినోద్, సంపత్, ప్రవీణ్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.