తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి అని మంగళవారం మండల వ్యాప్తంగా నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల ఆయన విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు మండల పరిషత్ తాజా పూర్వ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి,యూ.ఎస్ ప్రకాశ్ రావు లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తహశీల్దార్ కార్యాలయం,వ్యవసాయ కళాశాల,ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయం,పరిశ్రమ కార్యాలయం,జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఏడీ హేమంత్ కుమార్,బాలక్రిష్ణ,నాగబాబు,పి.హరిత లు పాల్గొన్నారు.