జూనియర్ కళాశాలలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు

జూనియర్ కళాశాలలో జయశంకర్ సార్ జయంతి వేడుకలునవతెలంగాణ – మల్హర్ రావు:
తెలంగాణ జాతిపిత,సిద్దాంత కర్త ప్రొపెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి ఆదేశాల మేరకు మంగళవారం ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఎన్ ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి,ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అధ్యాపకులు మాట్లాడారు జయశంకర్ సార్ విద్యార్థి దశ నుండి తను మరణించేవరకు తెలంగాణ గురించి ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ కోసం అనేక కార్యచరణాలు చేశాడని,ఆయన పుట్టుక మీది, చావు మీది బతుకంతా తెలంగాణదని ప్రత్యేక తెలంగాణ సాధనకు ఒక దిక్సూచిగా నిలిచాడని కొనియాడారు. చివరికి చివరి కోరిక ప్రత్యేక తెలంగాణను చూడకుండానే అనారోగ్యంతో కన్నుమూశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్ అధ్యాపకులు నరేందర్, ప్రవీణ్, వెంకట్ రెడ్డి, కరుణాకర్, స్వరూప రాణి, రమేష్, నరేష్, భరత్ రెడ్డి, జైపాల్, రవి కళాశాల సిబ్బంది రవి, కిరణ్ షబ్బీర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.