
మండల కేంద్రమైన కుభీర్ తో పాటు ఫార్డి బి,పల్సి,సోనారి తదితర గ్రామంలో మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ 90 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షడు లవకుశ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉద్యమ కరుడు పుప్ఫల పీరాజి మరియు మండల నాయకులు ప్రొపెసర్ జయ శంకర్ చిత్ర పటానికి పూజలు చేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగాప్రతీ ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. ఆయన చేసిన సేవలు గుర్తు ఉంచుకొని ఆయన అడుగుజాడల్లో నడిచేలా కృషి చేయాలని తెలపరు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు పుప్ఫల పీరాజి లవకుశ బషీర్ బాబు రాజేశ్వర్ మండల అధ్యక్షులు బషీర్, సీనియర్ నాయకులు బంక బాబు,ప్రకాష్ , విజయ్, శ్రీనివాస్, , రాందాష్, బాబు, అంగన్వాడీ టీచర్లు ఆశలు తదితరులు పాల్గొనడం జరిగింది.