ఘనంగా జయశంకర్ వర్ధంతి వేడుకలు 

నవతెలంగాణ – పెద్దవంగర: తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పోరాడిన మహనీయుడు జయశంకర్‌ సార్‌ అని ఎంపీపీ ఎర్ర సబిత వెంకన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. జయశంకర్ వర్ధంతి వేడుకలను శుక్రవారం మండలంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు, ఓరిగంటి సతీష్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, పాలకుర్తి దేవస్థానం డైరెక్టర్ పన్నీరు వేణు, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, అనపురం శ్రీనివాస్, అనపురం వినోద్, రాంబాబు, పవన్ తదితరులు పాల్గొన్నారు.