తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌ పాత్ర కీలకం

– చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్‌ శైలజా ఆగిరెడ్డి, పీఎసీఎస్‌ చైర్మెన్‌ దేవర వెంకట్‌రెడ్డి
– చేవెళ్లలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
నవతెలంగాణ-చేవెళ్ల
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ పాత్ర కీలకమని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచ్‌ శైలజా ఆగిరెడ్డి, పీఎసీఎస్‌ చైర్మెన్‌ దేవర వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్లలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహ ప్రతిష్టాపనకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాటా ్లడుతూ తెలంగాణ పోరాటం చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే వ్యక్తి జయశంకరని కొనియాడారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. నేడు విశ్వబ్రాణులు చేవెళ్లలో జయశంకర్‌ విగ్రహా ఏర్పాటుకు పూనుకోవడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు జయ శంకర్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954లో ఫజల్‌ అలీ కమిషనకు నివేదిక అంద జేసినట్టు తెలిపారు. కేసీఆర్‌కు సలహా దారుగా, మార్గదర్శిగా తోడ్పాటునందిచారనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాసి నట్టు వెల్లడించారు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి వివరించారని చెప్పారు. విద్యార్థి దశ నుండే తెలంగాణ పట్ల జరు గుతున్న అన్యాయాలు, అసమనాతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారని తెలిపారు. జయశంకర్‌ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.రామస్వామి, ఎంపీటీసీ రాము లు, చేవెళ్ల మాజీ ఉప సర్పంచ టేకులపల్లి శ్రీనువాస్‌, కాంగ్రెస్‌ మహిళా మండలాధ్యక్షురాలు దేవర సమతావెంకట్‌రెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘం చేవెళ్ల మండలం అధ్యక్షుడు వి. శ్రీనివాసచారి, ప్రధా న కార్యదర్శి వి. శ్రీనివాసచారి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శంభులింగంచారి, ఉపాధ్యక్షులు ఆనంద్‌, విశ్వ రూపచారి, ఆలయ కమిటీ అధ్యక్షుడు లింగాచారి, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, లీగల్‌ అడ్వైజర్‌ బాలస్వామి, విశ్వబ్రాహ్మణ సంఘం మండల మాజీ అధ్యక్షులు మోనాచారి, యాదగిరిచారి, యూత ప్రెసిడెంట్‌ ప్రశాంత, ఉపాధ్యక్షుడు శంకరాచారి, పెంటయ్య చారి, శేఖర్‌చారి పాల్గొన్నారు.