– అడుగడుగునా జన నిరాజనాలు
– మంగళ హరతులతో మహిళలు స్వాగతం
నవతెలంగాణ -పెద్దవూర: నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్ ప్రచారం లో దూసుకెళుతున్నారు. అడుగడుగునా ప్రజలు నిరాజనాలు పడుతున్నారు. ఏ గ్రామం వెళ్లినా మహిళలు మంగళహరతులు పడుతున్నారు. శుక్రవారం మండలం లోని చలకుర్తి, పెద్దవూర మండల కేంద్రం లో ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ప్రజలు భారీ ఎత్తున ప్రచారం లోఅపాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే రాష్ట్రంలో ప్రజా సంక్షేమం అని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఇందిరమ్మ పథకాలు రావాలంటే బీఆర్‌ఎస్ పాలన పోయి కాంగ్రెస్ పాలన రావాలన్నారు. అధికారం లోకి రాగానే ఆరు గ్యారేంటీలను అమలు చేసి తిరుతామని అన్నారు. రు.500 లకే గ్యాస్ సిలెండర్, మహిళలకు ప్రతి నెల రు.2500 లు, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి రు.5,00,000 లు, అందిస్తామన్నారు. ఆరోగ్య పథకం ద్వారా రు.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరుతో 67 అంశాల తో మేనిఫెస్టో తయారు చేశామని వాటిని అమలు చేస్తామని తెలిపారు. ప్రతి నెల 4000 లు అందిస్తామన్నారు. ఆడబిడ్డ పెళ్ళికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని, అలాగే రైతులకు ఒకే సారీ 2,00,000 రుణమాపి చేస్తామని తెలిపారు.200 ల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ బిల్లు అమలు, నిరద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ తదితర పథకాలను అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటిసి రామావత్ శంకర్ నాయక్, సర్పంచ్ తుమ్మల పల్లి లలిత వెంకట్ రెడ్డి, ఎంపీటిసి గోదాల నారాయణ రెడ్డి, మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి, జిల్లా నాయకులు గడ్డం పల్లి వినయ్ రెడ్డి, వాసికర్ల వినయ్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిలారి మురళీకృష్ణ, పగడాల నాగరాజు, చల్ల హన్మంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.