నోవాటెల్‌లో జేడీ డిజైన్‌ అవార్డ్స్‌-2024

నవతెలంగాణ-సిటీబ్యూరో
యువ ఫ్యాషన్‌ డిజైనర్ల సజనాత్మకతను నోవాటెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆవిష్కరించారు. ది జేడీ డిజైన్‌ అవార్డ్స్‌-2024తో పాటు ఫ్యాషన్‌ షోలో మోడల్స్‌ అదరహౌ అనిపించారు. ఇందులో భాగంగా పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు, ఇన్ఫ్లుయెన్సర్స్‌, మీడియా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెస్ట్‌ డిజైన్‌, బెస్ట్‌ కమర్షియల్‌ కలెక్షన్‌, అత్యంత సజనాత్మక కలెక్షన్‌, బెస్ట్‌ అప్సైకిల్డ్‌ ఫ్యాషన్‌ పేరుతో ఇక్కడ యువ ఫ్యాషన్‌ డిజైనర్లు తమ సజనాత్మకతకు ఆలోచనలను మేళవించి అద్భుత ఆవిష్కరణలను ప్రదర్శించారు. జేడీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ మేనేజింగ్‌ ట్రస్టీ, జేడీ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ వ్యవస్థాపకులు నీలేష్‌ దలాల్‌ మాట్లాడుతూ ఈ అవార్డుల కార్యక్రమం ద్వారా ఔత్సాహిక డిజైనర్ల ప్రతిభకు, నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కత్రిమ మేధ ఆధారంగా ఇక్కడ కొందరు విద్యార్థులు తమ డిజైన్లను ఆవిష్కరిస్తున్నారన్నారు. కత్రిమ మేధ ఇప్పుడు ఫ్యాషన్‌ రంగంలో శక్తివంతమైన సాధనంగా మారిందని, నమూనా ఉత్పత్తి, మెటిరీయల్‌ ఎంపిక, వ్యూహాత్మక అంశాలపై దష్టి పెట్టేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఫ్యాషన్‌, ఇంటీరియర్‌ పరిశ్రమలో సూక్ష్మ నైపుణ్యాలను, ప్రాజెక్టు వెనుక ఉన్న ప్రక్రియను అర్ధం చేసుకోవడానికి తేలికగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఇక్కడ ప్రదర్శించారు.