ఉపాధి హామీ పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో

– పోతారంలో ఉపాధి హామీ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం జెడ్పి సీఈవో రమేష్ పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న లెవెలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ కూలీల సమక్షంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం18 వ అవిర్భవ దినోత్సవం వేడుకలు నిర్వహిస్తారు. పని చేస్తున్న కూలీలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ వీరభద్రయ్య, ఎంపీఓ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ఏల్లయ, టీఏ పరుశురాములు ,వెంకటేష్ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.