అసూయ

Jealousyఅన్నవరము అనే ఊరిలో రఘు, కిరణ్‌ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరిలో రఘుకి పాటలంటే చాలా ఇష్టం. అతను పెద్దయ్యాక గొప్ప గాయకుడు కావాలని అనుకుంటాడు. మెల్లమెల్లగా వారు పదో తరగతి పూర్తి చేసి ఇంటర్‌ చదువు తుంటారు. ఒకరోజు వారి తెలుగు ఆచార్యులు ”మీలో ఎవరైనా పాటలు, కథలు పద్యాలు, కవితలు రాస్తే నాకు ఇవ్వండి. పోటీలకు పంపుతాను” అన్నారు. అప్పుడు రఘుకి ఒక ఆలోచన వస్తుంది. నేను ఒక పాట సొంతంగా రాసి సార్‌కి ఇస్తే సారు వారికి పంపుతాడు కదా!

వెంటనే రఘు లేచి, ”సార్‌ నేను ఒక పాట రాస్తాను.”అన్నాడు. రఘు అన్నట్టే ఒక మంచి పాట రాసి ఇచ్చాడు. సార్‌ అది పాటల పోటీకి పంపుతాడు. అతని పాటకు ప్రథమ బహుమతి నిర్ణయించ బడుతుంది. అతనికి ఒక సాహితి వేదిక పైకి వెళ్లే అవకాశం వచ్చింది. అతను ఆ పాటను అక్కడ అందరికీ పాడి వినిపించాడు. ఆ వేదికపైనున్న ఒక సాహితీవేత్త ”శభాష్‌ రఘు” అని అతనికి తన పెన్ను బహుమతిగా ఇచ్చాడు.
రఘు పాటలు రాస్తూ రాష్ట్రంలోనే ప్రముఖ గాయకుల చేత మెప్పు పొందుతాడు. అది చూసిన కిరణ్‌ వాళ్ళ అమ్మ అసూయపడి ”చూసావా కిరణ్‌ ,రఘు పాటలు వ్రాసి ఎంత పేరు తెచ్చుకున్నాడు. నువ్వు కూడా పాటలు రాయి” అని చెబుతుంది.
అప్పుడు కిరణ్‌కి చెడు ఆలోచన కలుగుతుంది. ఆ రోజు రాత్రి రఘు ఇంటి కెళ్ళి అతడు రాసిన పాటలను కిరణ్‌ దొంగలిస్తాడు. తెల్లారి రఘు లేచి చూడగానే రాసిన పాటలు ఉండవు ఇవి ఎక్కడ పోయాయో తెలియడం లేదు. కాలేజీకి వెళ్లి పుస్తకాలలో వెతుకుతాడు ఆక్కడ దొరకవు. అప్పుడు ఈ విషయం తెలుగు ఆచార్యులకు చెబుతాడు. చెప్తే సార్‌ ఒక ప్లాన్‌ ఇస్తాడు.
”నేను మన తరగతి గదికి వచ్చినప్పుడు ఎవరెవరు పాటలు రాసారు అని అడిగినప్పుడు ఎవరైతే పేపర్‌ ఇస్తారో, వారిని చూడకుండా చెప్పు మంటాను ఎవరైతే చెప్పరో వారే నీ పాటలు దొంగతనం చేసినట్లు తెలుస్తుంది” అది రఘుకి నచ్చి సరే సార్‌ అంటాడు.
తెలుగు ఆచార్యులు తరగతి గదికి వచ్చి పాటలు రాసిన వారు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు కిరణ్‌ లేచి
”సార్‌ నేను పాటలు రాసాను. చూడండి” అంటూ ఇస్తాడు. తెలుగు ఆచార్యులకు అనుమానం వచ్చి ఈ పాటలు చూడకుండా చెప్పు అని అడుగుతాడు .అప్పుడు కిరణ్‌ చెప్పడు. ఆచార్యులకు అర్థమ యింది. కిరణ్‌, రఘు ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసాడని అనుకుంటాడు.
వెంటనే రఘును పిలిచి నువ్వు నిన్న రాసిన పాట చెప్పు అని అడగగానే రఘు రాసిన పాటలు అన్ని పాడి వినిపిస్తాడు. కిరణ్‌ ఇచ్చిన పేపర్లో ఇతను రాసినవే ఉన్నాయి అంటే కిరణే దొంగతనం చేశాడని అర్థం చేసుకొని, సార్‌ ఆ పేపర్లను రఘుకు ఇస్తాడు.
కిరణ్‌ రఘుతో ”నన్ను క్షమించు. నేను నీ మీద అసూయ కలిగి ఉండకూడదు. నా తప్పు నేను తెలుసుకున్నాను” అన్నాడు.
”ఏదైనా మనము సొంతంగా కష్టపడి సాధించాలి కాని అసూయతోనో,మరే కారణం తోనో దొంగతనం చేయకూడదు” అని తెలుగు ఆచార్యులు కిరణ్‌ కు బుద్ది చెప్పాడు.

– బి.విశ్వ తేజ
ఆరవ తరగతి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అనంత సాగర్‌, సిద్దిపేట జిల్లా
9959007914