నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో ఎన్‌ఐటీలు, త్రిపుల్‌ఐటీల్లో ప్రవేశం, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేయనుంది. ఈనెల నాలుగు నుంచి 12 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్ రెండో విడత రాతపరీక్షలకు 12.57 లక్షల మంది హాజరయ్యారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జేఈఈ మెయిన్ మొదటి రాతపరీక్షలను నిర్వహించారు. 12,21,624 మంది దరఖాస్తు చేయగా, 11,70,048 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 23 మంది వంద ఎన్‌టీఏ స్కోర్‌ను సాధించారు. వారిలో పది మంది తెలుగు విద్యార్థులే ఉండడం గమనార్హం. ఇందులో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు, ఏపీ విద్యార్థులు ముగ్గురు ఉన్నారు.