జీలానీ బానూ తెరిచిన పుస్తకం

Jeelani Banu
An open book”సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా, గదిలో తలుపులు బంధించుకుని నేను కథలు రాయలేదు. నా చుట్టుపక్కల పరిస్థితులు, గ్రామాలలోని ఘటనలు, అసహాయ మహిళలు, పొలాల్లో కూలిపని చేసుకునే పిల్లలు – ఇలా అందరినీ దగ్గర నుంచి చూశాకే రచనలు చశాను. (తెరిచిన పుస్తకం – పేజీ 52). ప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి జీలానీ బానూ జీవితానుభవంతో కూడుకుని అక్షర రూపంలో వెలువడ్డ సత్యాలివి. రచయిత్రి తన జీవితంలో అనుభవించిన తీపి, చేదు అనుభవాలు, ఆనంద విషాదాల అనుభూతులు, విధి నిషేధాల ఉల్లంఘనల దస్తావేజుగా రచించిన ఆత్మకథ ఈ ‘తెరిచిన పుస్తకం’. జీలానీ బానూ ఉర్దూ పుస్తకం ‘మై కోన్‌ హూ’ కి ఇది తెలుగు అనువాదం. ఈ అనుభవ సంగ్రహాన్ని ఆద్యంతం చదివేలా తెనిగించిన కౌశలం మహక్‌ హైదరాబాదీగా పేరుమోసిన పి.వి.నరసింహమూర్తిది.
1954 నాటి మాట ఇది. పేదరికంలో మగ్గి మసిబారి పోతున్న వస్తువుగా ‘రోష్నీ కె మీనార్‌’ (వెలుతురు స్తంభాలు) లాహోర్‌లోని ‘సవేరా’ (ఉదయం) పత్రికలో 1958లో అచ్చయింది. ఆ కథ హైదరాబాద్‌ రచయిత మఖ్దుం మొహియుద్దీన్‌ను కించపరిచే కథ అంటూ తీవ్ర సంచలనం రేకెత్తింది. కానీ మఖ్దుం ఆ కథ రాసినందుకు బానూను ఎంతగానో అభినందించారు. అంతేకాదు, తన ఆనందాన్ని 21-6-1959 నాటి ఉత్తరంలో ఇలా వెలువరించారు – ”హైదరాబాద్‌లోని సామాజిక జీవితం, సంస్కృతీ సంప్రదాయాలు, నాటి పరిస్థితులను విస్మరించుకుంటూ రచనలు చేసిన రచయిత్రి మీరొక్కరే. ఈ రచనలు చదువుతుంటే శిథిలమవుతునన సామాజిక వ్యవస్థ దు:ఖం, వేదనతో పాటు కొత్తగా ఉదయించిన నవజాత ప్రజాతంత్ర శిశువు గుక్కపెట్టి ఏడుస్తున్నట్టుగా తీయని గొంతు నాకు వినిపిస్తోంది”.

జీలానీ బానూ బాల్యం, యవ్వనం హైదరాబాద్‌ పాతబస్తీకి దూరంగా లాల్‌ టెక్రీకి దగ్గరగా వున్న మల్లేపల్లి కాలనీలో గడిచింది. ఆడపిల్లలు చారు తాగకూడదనీ, పాన్‌ వేయకూడదనీ, గట్టిగా నవ్వకూడదనీ, ఇంటికి ఎవరైనా మగవాళ్లు వస్తే వాళ్ల కంట పడకూడదని, స్కూల్‌కు వెళ్లకూడదని తల్లి షకీలా ఖాతూన్‌ అష్టదిగ్భంధనాలు. కానీ కవి, పండితుడైన తండ్రి సయ్యద్‌ హసన్‌ హైరత్‌ బదాయూనీ ఉర్దూ సాహిత్యం పట్ల; భారతదేశ చరిత్ర, హిందూ ముస్లిం, కిరస్తానీ మతగ్రంథాల పట్ల తన పిల్లలకు భక్తి శ్రద్ధలు కలిగించాడు.
జీలానీ బానూ ముస్లిం, హిందూ, క్రిస్టియన్‌ స్నేహితురాళ్ల మధ్య పెరగడంతో మత సామరస్యం ఆమెకు చిన్నప్పుడే అలవడింది. తమ ఇంటికి దగ్గర్లోనే వున్న జంగం బస్తీలో రాత్రిపూట ప్రదర్శించే హిందూ పౌరాణిక నాటకాలు తమ్ముళ్లు, చెల్లెళ్లు హిందూ క్రిష్టియన్‌ స్నేహితురాళ్లతో తెగ చూసేది. తమ ఇంటి పెరట్లో తెరలు కట్టి పురాణ సంబంధమైన నాటకాలు ఆడేది. ఇరుగుపొరుగు ఇళ్ల వాళ్లు కూడా ఆ ప్రదర్శనలు చూసి సంతోషించేవాళ్లు. నాటకాల్లో పాల్గొన్న వాళ్లందరికీ బానూ నాన్న తలో పావలా బహుమతిగా ఇచ్చేవారు. అప్పుడు పిల్లలందరూ ఏనుగునెక్కినంతగా సంబరపడేవాళ్లు.
జీలానీ బానూ తండ్రి హసన్‌ హైరత్‌ సాహెబ్‌ గారి ఇల్లు కవి పండితులకు చర్చావేదికగా వుండేది. ప్రఖ్యాత ఉర్దూ కవులు కైఫీ ఆజ్మీ, అలీ సర్దార్‌ జాఫ్రీ, షకీల్‌ బదా యూనీ, మజ్మూV్‌ా సుల్తాన్‌పురీ, మఖ్దూం మొహియుద్దీన్‌ల కవితా గోష్టులు, చర్చావేదికలు తెర చాటునుంచి వినే జీలానీలో అభ్యుదయ భావాలు రేకెత్తించాయి.
బానూకు చిన్నప్పటి నుంచీ జిజ్ఞాస, ప్రశ్నించే గుణం అలవడ్డాయి. బాలబానూ బాల్యలో చెప్పిన సీతమ్మవారి కథలో తన్ను ఎత్తుకెళ్లడానికి వచ్చిన రావణాసురుణ్ణి కత్తితో చావుదెబ్బలు కొట్టి తరిమేస్తుంది. ఆ కథ వింటున్న తమ్ముళ్లు, చెల్లాయిలు మధ్యలో మూతులు ముడుచుకుని వెళ్లిపోతే తానేమో మురిసిపోయేది.
జీలానీ బానూ చిన్నప్పుడే రాసి, పెరట్లో ప్రదర్శించిన ‘చక్రవర్తి ఒక్క రోజు పాలన’ అనే నాటికలో తాను చక్రవర్తిగా, నాన్నమ్మ లల్లీ అనే బాలికగా పాల్గొనింది. ఆ నాటకంలో బానూ లిల్లీని రకరకాలుగా వేధిస్తాడు. నానమ్మ తన మనుమరాళ్లను వేధించిన తీరు తల్చుకుని మనస్సు మార్చుకుంది. మానవ హృదయ పరివర్తన జీలానీ బానూ రచనాశయంగా చిన్నప్పుడే మొలకెత్తిందన్న మాట. తమ కాలనీలో వున్న చాంద్‌పాషా అన్న అమ్మాయి మగవాళ్లచే మోసగింపబడి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని ‘మోమ్‌కీ మరియం’ అన్న కథగా రాసి లాహోర్‌లోని ‘అదచే లతీఫ్‌’ పత్రికకు పంపితే అది అచ్చయింది. ఈ కథ పాకిస్తాన్‌లోని, భారతదేశంలోని ఉర్దూ రచయితలు మెచ్చుకుని ప్రశంసల వర్షం కురిపించారు. ఇది జీలానీ బానూ అచ్చయిన మొట్టమొదటి కథానిక.
1954 నాటి మాట ఇది. పేదరికంలో మగ్గి మసిబారి పోతున్న వస్తువుగా ‘రోష్నీ కె మీనార్‌’ (వెలుతురు స్తంభాలు) లాహోర్‌లోని ‘సవేరా’ (ఉదయం) పత్రికలో 1958లో అచ్చయింది. ఆ కథ హైదరాబాద్‌ రచయిత మఖ్దుం మొహియుద్దీన్‌ను కించపరిచే కథ అంటూ తీవ్ర సంచలనం రేకెత్తింది. కానీ మఖ్దుం ఆ కథ రాసినందుకు బానూను ఎంతగానో అభినందించారు. అంతేకాదు, తన ఆనందాన్ని 21-6-1959 నాటి ఉత్తరంలో ఇలా వెలువరించారు – ”హైదరాబాద్‌లోని సామాజిక జీవితం, సంస్కృతీ సంప్రదాయాలు, నాటి పరిస్థితులను విస్మరించుకుంటూ రచనలు చేసిన రచయిత్రి మీరొక్కరే. ఈ రచనలు చదువుతుంటే శిథిలమవుతునన సామాజిక వ్యవస్థ దు:ఖం, వేదనతో పాటు కొత్తగా ఉదయించిన నవజాత ప్రజాతంత్ర శిశువు గుక్కపెట్టి ఏడుస్తున్నట్టుగా తీయని గొంతు నాకు వినిపిస్తోంది”.
జిలానీ బాను మధ్యతరగతి కుటుంబాల, బడుగు జీవితాల్ని, కార్మిక కర్షక కర్మవీరుల పోరాటాల్ని కథలు, నవలల రూపంలో శక్తిమంతంగా, ప్రభావస్ఫోరకంగా చిత్రించిన రచయిత్రి. ఆమె కథా సంపుటి ‘రాస్తా బంద్‌హై’, లేఖల సంగ్రహం ‘దూర్‌కీ ఆవాజీ’, పాఠకుల విమర్శకుల మన్ననలు పొందాయి. ఆమె నవల ‘ఐవానే గజల్‌’ ఉర్ధూ నవలా సాహిత్యంలో ఓ మైలురాయి.
జీలానీ బానూ వివిధ భాషా రచయితలతో, రచయిత్రులతో స్నేహ సంబంధాలు పెంచుకున్న విశిష్ట రచయిత్రి. గంగా యమునా సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆమె మత సామరస్యానికి రాయబారిగా నిలిచింది. దేశ విదేశయాత్రలు సాగించి, మానవతా వాదాన్ని ప్రతిపాదిస్తూ నిరంతర రచనా వ్యాసంగంలో మునిగి తేలుతున్న ఆమె తన జీవితాశయాన్ని ఇలా ప్రకటించంది. ”మతం, సైన్సు, రాజకీయాల అగ్నిగుండంలో నేడు ప్రపంచం నిలువునా దహనమై పోతోంది. భవిష్యత్తులో ఇలా ఎంతమాత్రం జరగడానికి వీల్లేదు.
అవును… నేనిప్పుడు రాయాల్సిన కథ ఇదే”
ఘట్టమరాజు, 9964082076