
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి లో తనకు చెందిన 76 ఎకరాల భూమిపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నా కుటుంబ సభ్యులైన నా భార్య రజిత రెడ్డి, అమ్మ రాజు భాయి లతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి సాధింపు చర్యలు చేపట్టాలని చూస్తున్నారని జీవన్ రెడ్డి వాపోయారు. ఈ అక్రమ కేసుల విషయంలో రాష్ట్ర హైకోర్టు తనను తన కుటుంబ సభ్యులను అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు నెరవేరలేదని, హైకోర్టు తమను ఏమి చేయవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు జీవన్ రెడ్డి వివరించారు.