నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్ ను విజిలెన్స్ టిఎస్ఆర్టిసి అధికారులు గురువారం సీజ్ చేసినారు .ఉదయం వచ్చిన అధికారులు మైక్ ద్వారా అనౌన్స్ చేసి సాయంత్రం అందులో ఉన్న వాళ్లను బయటకు పంపి ప్రధాన గేటుకు తాళం వేసినారు. ఈ మాల్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది .ఇటీవల మాల్ సీజ్ చేస్తామని అధికారులు ప్రకటించగా, ఎన్నికల వేల తనపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో టిఎస్ఆర్టిసి అధికారులు ఆయన ఆరోపణలపై వివరణ సైతం ఇవ్వడం జరిగింది. తాము చట్ట ప్రకారంగానే మాల్ పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో జీవన్ రెడ్డి మాల్ సీజ్ చేసినారు.