– కాంగ్రెస్ పార్టీలో చేరిన ముదిరాజ్ సంఘ సభ్యులు
నవతెలంగాణ కమ్మర్ పల్లి
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా జీవన్ రెడ్డి గెలుపుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని ఉప్లూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యాలయంలో గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యులు ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముదిరాజ్ సంఘ సభ్యులు బైండ్ల శ్రీను, రాజేందర్, భాజన్న, భాస్కర్, నడ్పి భూమన్న, భాను, బుచ్చన్న, చిన్న బాజన్న, రాజేశ్వర్ తదితరులు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. అదేవిధంగా ఉప్లూర్ యూత్ సభ్యులు సాగర్, ఉబెదు, రాజు తోపాటు ఉప్లూర్ పద్మశాలి సీనియర్ నాయకులు నందగిరి వెంకట్, మరికొంత మంది బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరందరినీ సునీల్ కుమార్ కండువాలు వేసి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న 6 గ్యారెంటీ లతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకుపోవాలన్నారు. జీవన్ రెడ్డి గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, నాయకులు చింతకుంట శ్రీనివాస్, బోనగిరి లక్ష్మణ్, సుంకరి విజయ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్, వేములవాడ జగదీష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.