పేదల పక్షపాతి  జహంగీర్ ను ను గెలిపించండి: తీగల సాగర్

నవతెలంగాణ – బొమ్మలరామారం
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎండి జహంగీర్  సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు కే ఓటు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్ కోరారు. గురువారం ప్రచార కార్యక్రమం లో భాగంగా బొమ్మలరామారం, చీకటి మామిడి గ్రామాల్లో సీపీఐ(ఎం) ఇంటింటికీ  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …జహంగీర్ ప్రజా ఉద్యమాల నాయకుడు అని, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీపీఐ(ఎం) పక్షాన గత 30 సంవత్సరాలుగా  అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర  ఉందని, అలాంటి వ్యక్తిని పార్ల మెంటు కు పంపాలని కోరారు. కేంద్ర  ప్రభుత్వం  అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ , అనేక ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రయివేటు పరం చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజల పై అనేక భారాలు , పన్నుల రూపంలో మోపుతూ, మరొకవైపు బడా కార్పోరేట్ కంపెనీల కు లక్షల కోట్లు కట్టబెడుతూ,ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తుంది. కాబట్టి ప్రజా సమస్యల పై పోరాటాలు చెసే సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్  నీ గెలిపించాలని కోరారు. రైతుల ను, కూలీలను మోసం చేస్తున్నదని అందుకే కమ్యూనిస్టులను పార్ల మెంటు కు పంపాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొప్పని పద్మ, ఈశ్వర్ రావు, కిషోర్, మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం,సల్లూర్ కుమార్ ముక్కెర్ల పున్నమ, నరసమ్మ ,సీతమ్మ, దేవేందర్, మంగ, తదితరులు పాల్గొన్నారు.