నవతెలంగాణ – నెల్లికుదురు
వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న చేతి గుర్తుపై ఓట్లు వేసి ప్రతి ఒక్క పట్టభద్రుడు గెలిపించుకోవాలని మండల వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడారు వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్ట బద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చాడని, దీనిని దీనిని ప్రతి ఒక్క పట్టభద్రుడు భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించి ప్రజా గొంతుక ను శాసన మండలికి పంపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరుకుంటూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరి కొడుతున్నట్టు తెలిపారు.