జెన్నీఫర్‌, దివ్యాన్షి చరిత్ర వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్స్‌

జెన్నీఫర్‌, దివ్యాన్షి చరిత్ర వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్స్‌న్యూఢిల్లీ : టేబుల్‌ టెన్నిస్‌లో భారత యువ జోడీ చరిత్ర సృష్టించింది. ప్రపంచ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌లో రజత పతకం సాధించిన జెన్నీఫర్‌ వర్జీస్‌, దివ్యాన్షి బోమిక్‌లు ఈ ఘనత సాధించిన తొలి భారత ప్యాడ్లర్‌ జోడీగా నిలిచింది. స్లోవేకియాలో జరిగిన ఈవెంట్‌లో అండర్‌-15 బాలికల విభాగంలో జెన్నీఫర్‌, దివ్యాన్షి సిల్వర్‌ షో చేశారు. ఫైనల్లో 5-11, 11-8, 4-11, 2-11తో పరాజయం పాలైంది. అండర్‌-15 మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జెన్నిఫర్‌ కాంస్య పతకం సైతం కొల్లగొట్టింది. ఈ టోర్నీలో భారత్‌కు కాంస్య పతకమే ఇప్పటి వరకు అత్యుత్తమం. ‘ ఎంతో గర్వంగా ఉంది. సిల్వర్‌ మెడల్‌ ఊహించలేదు. సెమీస్‌లో బలమైన ఫ్రెంచ్‌, చైనీస్‌ జోడీపై విజయం అద్భుతం’ అని జెన్నీఫర్‌, దివ్యాన్షి తెలిపారు.