పునరుద్ధాన శక్తిమంతుడుతు యేసుక్రీస్

– రెవ.డాక్టర్ సంగాల పాల్సన్ రాజు
నవతెలంగాణ – ధర్మసాగర్
పునరుద్ధానం కలిగిన శక్తిమంతుడు లోక రక్షకుడు యేసుక్రీస్తు అని క్రీస్తుజ్యోతి మినిస్ట్రిస్ ఫౌండర్, అంతర్జాతీయ  ప్రసంగీకులు, ప్రవక్త రెవ.డాక్టర్ సంగాల పాల్సన్ రాజు అన్నారు.మండలంలోని కరుణాపురంల గ్రామంలో ఆదివారం సొసైటీ ఆఫ్ క్రైస్ట్  ఆద్వర్యంలో క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో జరిగిన ఈస్టర్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సొసైటీ జనరల్ సెక్రటరీ రెవ‌.డాక్టర్ జయప్రకాశ్ గోపు అధ్యక్షత వహించారు. ఈ  సందర్భంగా పాల్సన్ రాజు మాట్లాడుతూ ప్రపంచ మానవాళి కోసం ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన క్రీస్తు మరణాన్ని జయించారని అన్నారు.   పునరుద్దానుడైన యేసు పరలోకానికి మార్గం సుగమం చేశారని ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు ప్రభువు చూపిన దారిలో పయనించి,మంచి ప్రవర్తన కలిగి,సాత్వికమైన స్వభావంతో జీవనాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు ఎంపీ బాబు మోహన్, ఇర్మియ, బ్రదర్స్, సిస్టర్స్, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.