– క్రిస్మస్ సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు
నవతెలంగాణబ్యూరో-హైదారబాద్
ఏసు ప్రభువు బోధనలు ఆయన చూపిన శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనమనే గొప్ప లక్షణాలు ఎప్పటికీ అనుసరణీయమని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని క్రైస్తవులకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన పారదర్శ కంగా, ప్రజాస్వామికంగా సాగుతుందని పేర్కొన్నారు. క్రిష్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సహాలతో క్రిస్మస్ను జరుపుకోవాలనీ, క్రీస్తు మార్గాన్ని అనుస రించి సమాజ అభివృద్ధి కోసం అందరు పాటుపడాలని సూచించారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని ఆయన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఏసు క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవ సోదర సోదరీమణులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని తెలిపారు.