సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సాధించిన జీసస్ విద్యార్థి

Jesus was a student who secured a seat in St. Martin's College of Engineeringనవతెలంగాణ – భీంగల్
పట్టణ కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎం.పీ.సీ. చదివిన విద్యార్థి బొమ్మకంటి కౌశిక్”  సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం నందు సీటు  సాధించి కళాశాలకు జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు   తీసుకువచ్చాడు.   కళాశాలకు కీర్తిప్రతిష్ఠలను అందించటమే కాకుండా  తోటి విద్యార్థులకు ఆదర్శంగా  నిలిచాడు. సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం నందు సీటు సాధించి కళాశాల  విద్యార్థులకు స్పూర్తిదాయకంగా నిల్వటం చాలా సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్., అబ్బ చిరంజీవి  హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలలు కూడా ప్రయివేటు కళాశాలకు దీటుగా విద్యను అందించడంలో ఏమాత్రం తీసిపోకుండా  ఉన్నాయని ఆయన తెలిపారు.  రాబోయే రోజుల్లో మరిన్ని సీట్లను అనేక రంగాల్లో  సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొమ్మ కంటి కౌశిక్ ను ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ కామర్స్  అధ్యాపకులు వురుమల్ల కృష్ణదాస్, శ్రీనివాస్ గౌడ్,  మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.