జ్యువెలరీ పెరల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ ప్రారంభం

జ్యువెలరీ పెరల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ ప్రారంభంహైదరాబాద్‌ : నగరంలోని హైటెక్స్‌లో హైదరాబాద్‌ జ్యువెలరీ పెరల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ (హెచ్‌జెఎఫ్‌) ఎగ్జిబిషన్‌ ప్రారంభ మైంది. జూన్‌ 7 నుంచి 9వ తేది వరకు 16వ జరగనున్న ఈ ప్రదర్శనను శుక్రవారం హైదరా బాద్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు అడ్మినిస్ట్రేషన్‌ జె పరిమళ హనా నూతన్‌ లాంచనంగా ప్రారంభించారు. హెచ్‌జెఎఫ్‌2024ను ఒక ప్రీమియర్‌ ఈవెంట్‌గా ఇన్‌ఫార్మా మార్కెట్స్‌, ఇండియా నిర్వహిస్తుంది. దీనిలో 350 మంది ఎగ్జిబిటర్‌లు 750 కంటే ఎక్కువ బ్రాండ్‌లను ప్రదర్శిస్తున్నారు.
ఈ ఎక్స్‌పో లో 200,000 కంటే ఎక్కువ తాజా డిజైన్‌లు 8,000 మంది వాణిజ్య కొనుగోలుదారులను ఆకర్శించనున్నాయని భావిస్తున్నారు. 2030 నాటికి రత్నాలు మరియు ఆభరణాల ఎగుమతులను యుఎస్‌ 75 బిలియన్‌ డాలర్ల కు (రూ.6.2 లక్షల కోట్లు) పెంచాలనే భారతదేశం ప్రతిష్టాత్మక లక్ష్యానికి ఇది మద్దతు ఇస్తుందని ఇన్ఫార్మా మార్కెట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ యోగేష్‌ ముద్రాస్‌ పేర్కొన్నారు.