
కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు సంచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గంట్లకుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే రైతులకు రుణమాఫీకి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్యం భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ లో చేరిన వారిలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బందు వెంకన్న, దుర్సోజు హనుమచారి ఉన్నారు. కార్యక్రమంలో మండల ఇంచార్జీ విజయ్ పాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, మండల ఉపాధ్యక్షుడు మురళి గౌడ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెరుకు సత్యం, బానోత్ వెంకన్న, ఎండీ ముక్తార్ పాషా, ముత్తినేని సోమన్న, ఈరెంటి శ్రీనివాస్, కొండ్రాతి కొమరమల్లు తదితరులు పాల్గొన్నారు.