నవతెలంగాణ – రాయపర్తి
పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి ఆకట్టుకున్నారు. గురువారం మండలంలోని మైలారం గ్రామ శివారులో కూలీలతో కలిసి బురదలో దిగి వరి వాటు వేశారు. మహిళలు పాటలు పాడగా వారితో ఆమె గొంతు కలిపారు. మహిళా కూలీలతో కలిసి నాటు వేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అన్నదాతలు దేశానికి అన్నం పెట్టే భూమిపుత్రులు అని కొనియాడారు. రైతు కూలీలు వ్యవసాయ పనులకు చాలా ముఖ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, రైతు కూలీలకు అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నారని వివరించారు. ఝాన్సీ రెడ్డి తమతో కలిసి నాటు వేయడం సంతోషంగా ఉందని కూలీలు తెలిపారు. అమెతోపాటు నాయకులు విజయ్ పాల్ రెడ్డి, గజ్జి దేవేందర్ రెడ్డి, పెద్దగోని సోమయ్య, సోమా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.