యశస్విని రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి: ఝాన్సీ రెడ్డి

– చిట్యాల గ్రామంలో కాంగ్రెస్ లోకి చేరికలు 

నవతెలంగాణ-పెద్దవంగర: పాలకుర్తిలో త్వరలో జరుగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్ ఆధ్వర్యంలో ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఆమె పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలకాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్నది కాంగ్రెస్ రాజ్యమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఇరవై రోజులు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని, ఆ తర్వాత భవిష్యత్ మనదేనని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని, పార్టీ లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మొగులగాని సోంమల్లు, ఆకుతోట వెంకన్న, నారబోయిన రమేష్, గజ్జి వెంకన్న, ఆవుల వెంకన్న, మొగులగాని రజినీకాంత్, రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.