జె సి ఐ ఇండియా జోన్ 12 లో 2025 కోఆర్డినేటర్ గా జిలకార్ నా యాన్

 

నవతెలంగాణ కంఠేశ్వర్ 
జీలకర్ నా యాన్ కు జెసిఐ ఇండియా జోన్ 12లో 2025 కోఆర్డినేటర్ గా స్థానం లభించింది. హైదరాబాద్ లో జె సి ఐ ఇండియా జోన్ 12, 2025 యొక్క నూతన కార్యవర్గం ఏర్పాటు కార్యక్రమం గురువారం నిర్వహించారు. జె సి ఐ ఇందుర్ కు చెందిన పూర్వ అధ్యక్షులు జీలకార్ నయన్ కు జెెసి ఐ వారోత్సవాల, గ్రీటింగ్స్ కోఆర్డినేటర్ గా స్థానం లభించింది.2024 లో ఉత్తమ జే సీఐ వారోత్సవాల కోఆర్డనేటర్ గా ప్రతిభ కనబరిచినందుకు 2025 జోన్ అధ్యక్షులు చతుర్వేది వుటుకూరు, 2024 జోన్ అధ్యక్షులు గోవింద్ కంకాని నయన్ కు వారోత్సవాల గ్రీటింగ్స్ కోఆర్డినేటర్ గా స్థానం కలిపించి నియామక పత్రం అందజేశారు.ఈకార్యక్రమం లో పూర్వ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు సునీల్ కుమార్ రుమల్ల, పూర్వ జాతీయ అధ్యక్షులు శిరీష్ దండు, 2025 ఎన్నికైన జోన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్, దిలీప్,సంకేత్, కార్యదర్శి జయంత్ శెట్టి నూతన కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.