జిమ్ నీ ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ళ  శ్రీధర్ బాబు 

నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
కాటారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ నీ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు శరీర దారుణ్యానికి జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ తమకు అనుకూలాన్ని బట్టి జిమ్ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు అలాగే ఎటువంటి అనారోగ్యం సమస్యలు తలెత్తవన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ కాటారం మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి గృహప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని జిమ్ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.