జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి..

Jio number 10 should be cancelled..నవతెలంగాణ – మునుగోడు
జీవో నెంబర్ పదిని రద్దుచేసి రిటైర్మెంట్ బిజినెస్ పెన్షన్ పెంచుతూ విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవోను ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సీఐటీయూ మునుగోడు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక క్యాంపు కార్యాలయం ఎదురుగా మునుగోడు, చింతపల్లి అంగన్వాడి ప్రాజెక్టు అంగన్వాడి టీచర్స్ , హెల్పర్స్ తో కలసి సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో పత్రాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్పర్లకు పాత పద్ధతిలో ప్రమోషన్స్ ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్  గత ప్రభుత్వ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  అంగన్వాడి జిల్లా నాయకురాలు కే రజిత ఆర్ శోభ సిహెచ్ సువర్ణ విజయలక్ష్మి విగ్నేశ్వరి, సులోచన ఆర్ శారద అరుణ విమలాదేవి మరియమ్మ సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.