నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన మహమ్మద్ జిషాన్ ను మండల యువజన కాంగ్రెస్ కార్యదర్శి గా నియమించారు. ఈ మేరకు బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్రబాబు నియామక పత్రాన్ని జి షాన్ కు అందజేశారు. నాగేంద్రబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ అధ్యక్షులు జె జె నర్సయ్య, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వాక మహేష్, భీంగల్ మండల ప్రదాన కార్యదర్శి సుంకరి సురేష్, తోట సతీష్, పొల్సాని రంజిత్, గోపి, సురేష్ పాల్గొన్నారు.